బ్రేకింగ్ : కమల్ నాధ్ రాజీనామా… కాసేపట్లో గవర్నర్ వద్దకు

ప్రజా తీర్పును బీజేపీ అపహాస్యం చేస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ తెలిపారు. ఐదేళ్లు పాలించమని తమకు అవకాశమిస్తే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్వవహరిస్తుందని [more]

;

Update: 2020-03-20 07:08 GMT

ప్రజా తీర్పును బీజేపీ అపహాస్యం చేస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ తెలిపారు. ఐదేళ్లు పాలించమని తమకు అవకాశమిస్తే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్వవహరిస్తుందని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని తెలిపారు. బీజేపీ పదిహేనేళ్లలో చేయలేనిది తాను పదిహేను నెలలో చేసి చూపించానని చెప్పారు. ఈ పదిహేను నెలల కాలంలో తాను చేసిన తప్పేంటో చూపించాలని కమల్ నాధ్ కోరారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేసిందన్నారు. ప్రభుత్వం పతనం కోసం బీజేపీ ఎదురుచూసిందన్నారు. సమర్థవంతమైన పాలనను అందించామని చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో గవర్నర్ వద్దకు కమల్ నాధ్ వెళుతున్నారు.

Tags:    

Similar News