మమతా దీక్ష విరమింపజేసిన చంద్రబాబు
సీబీఐ విచారణ తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష విరమించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకత్తా వెళ్లి [more]
;
సీబీఐ విచారణ తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష విరమించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకత్తా వెళ్లి [more]
సీబీఐ విచారణ తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష విరమించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకత్తా వెళ్లి ఆమె చేత దీక్ష విరమింపజేశారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కలకత్తా పోలీస్ కమిషనర్ ను విచారించేందుకు సీబీఐ అధికారులు వెళ్లడం… వారిని మమతా పోలీసుల చేత అరెస్టు చేయించడం… తర్వాత ‘సేవ్ ఇండియా – సేవ్ డెమాక్రసీ’ పేరుతో కలకత్తాలో నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కేంద్రం… ఏపీ, బెంగాల్, ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నేతలు తప్ప మిగతా వారంతా అవినీతిపరులా అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను అడ్డుపెట్టుకొని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మమత దీక్షకు కాంగ్రెస్, టీడీపీ సహా పలు బీజేపీ వ్యతిరేక పక్షాలు సంఘీభావం తెలిపాయి. అయితే, సీబీఐ విచారణకు కలకత్తా కమిషనర్ హాజరుకావాల్సిందేనని ఇవాళ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.