రాహుల్‌, చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చిన మ‌మ‌త..?

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందే ఈ నెల 21న విప‌క్షాల స‌మావేశం నిర్వ‌హించాల‌నుకున్న రాహుల్ గాంధీ, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాల‌కు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా [more]

Update: 2019-05-11 08:35 GMT

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందే ఈ నెల 21న విప‌క్షాల స‌మావేశం నిర్వ‌హించాల‌నుకున్న రాహుల్ గాంధీ, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాల‌కు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ షాక్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఎన్డీఏకు ఎట్టి ప‌రిస్థితుల్లో మ్యాజిక్ ఫిగ‌ర్ రాద‌ని న‌మ్మ‌కంగా ఉన్న రాహుల్, చంద్ర‌బాబు మొన్న భేటీ అయ్యారు. ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందు బీజేపీ వ్య‌తిరేక ప‌క్షాల‌న్నింటినీ ఒక్క‌తాటిపైకి తీసుకురావాల‌ని భావించారు. ఈ స‌మావేశంలో ద్వారా వీరంతా కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మిలో ఉన్నార‌నే భావ‌న తీసుకురావాల‌ని, ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ పేరును సైతం ఫైన‌ల్ చెయ్యాల‌ని భావించారు. ఈ మేర‌కు నిన్న చంద్ర‌బాబు నాయుడు మ‌మ‌తా బెన‌ర్జీతో స‌మావేశ‌మై చ‌ర్చించార‌ని స‌మాచారం. అయితే, ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందు స‌మావేశం అవ‌స‌రం లేద‌ని, ఫ‌లితాల త‌ర్వాత ఈ విష‌యంపై ఆలోచిద్దామ‌ని మ‌మ‌తా బెనర్జీ చెప్పార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ కూట‌మిలో కాంగ్రెస్ ఉండాల‌ని మ‌మ‌తా భావిస్తున్నా రాహుల్ గాంధీని ప్ర‌ధానిగా ఒప్పుకునేందుకు ఆమె సిద్ధంగా లేన‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News