జగన్ పై చిరు మరోసారి?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రశంసలు కురిపించారు. జగన్ ను తాను సైరా సినిమా విషయంలో కలిసినప్పుడు వన్ టు వన్ [more]

Update: 2020-01-02 08:03 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రశంసలు కురిపించారు. జగన్ ను తాను సైరా సినిమా విషయంలో కలిసినప్పుడు వన్ టు వన్ తాను, జగన్ మాట్లాడుకున్నామన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండ్రస్ట్రీ అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగిందన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయమన్నా చేస్తానని జగన్ తనకు హామీ ఇచ్చారని చిరంజీవి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు భీమిలీలో 300 ఎకరాలను కేటాయించారని, దానిపై మాట్లాడేందుకు సినిమా పరిశ్రమ పెద్దలు జగన్ వద్దకు వెళ్లాలని పర్చూరు గోపాల కృష్ణ అన్నారు. దీనికి స్పందించిన జగన్ ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా సహకరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.

Tags:    

Similar News