గతంలో బాబు ప్రసంగాన్ని అసెంబ్లీలో

శాసనమండలి వ్యవస్థను వద్దని చెబుతూ 2004 జులై 8వ తేదీన చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఈరోజు సభలో వీడియోను ప్రభుత్వం ప్రదర్శించింది. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ [more]

;

Update: 2020-01-27 08:10 GMT

శాసనమండలి వ్యవస్థను వద్దని చెబుతూ 2004 జులై 8వ తేదీన చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఈరోజు సభలో వీడియోను ప్రభుత్వం ప్రదర్శించింది. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు గతంలో శాసనమండలి అవసరం లేదని వ్యాఖ్యానించారని చెబుతూ ఈ వీడియోను ప్రదర్శించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ శాసనమండలి వ్యవస్థ వల్ల బిల్లుల్లో జాప్యం జరుగుతుందన్నారు. అనవసర వ్యయమని చంద్రబాబు అన్న విషయాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ ఇలాగే యూటర్న్ లు తీసుకుంటారన్నారు పేర్ని నాని. రోజుకో మాట మాట్లాడుతుంటారని పేర్ని నాని మండి పడ్డారు. ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా చంద్రబాబు అమరావతి అంటూ కాలగడిపేశారన్నారు పేర్ని నాని. నలభై ఏళ్ల దిక్కుమాలిన అనుభవంతో చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.

Tags:    

Similar News