వివేకా హత్య కేసు : సీబీఐ నోటీసులను తీసుకోని అవినాష్ రెడ్డి ?

అవినాశ్, భాస్కర్ రెడ్డిలను విచారించేందుకు ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయ పరిధిలోని స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ థర్డ్ విభాగానికి చెందిన..

Update: 2022-03-04 07:48 GMT

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఇటీవల వివేకా కుమార్తె సునీతా.. పలువురిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి హత్యలో కొంతమంది హస్తం ఉందంటూ ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా.. సీబీఐ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకూ 207 మందిని సీబీఐ అధికారులు విచారించి, 146 మంది నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు. కొందరు ఇచ్చిన వాగ్మూలంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. దాంతో సీబీఐ వారిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది.

అవినాశ్, భాస్కర్ రెడ్డిలను విచారించేందుకు ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయ పరిధిలోని స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ థర్డ్ విభాగానికి చెందిన అధికారులతో పాటు.. కొందరు ముఖ్య అధికారులు నిన్న పులివెందులకు చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ.. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు పంపగా.. వాటిని తీసుకునేందుకు అవినాశ్, భాస్కర్ లు నిరాకరించినట్లు సమాచారం. దాంతో సీబీఐ అధికారులు కడప జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కోర్టు అనుమతి తీసుకుని, మరోసారి వారికి సీబీఐ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News