ఎస్పీపై నల్లపురెడ్డి ఫైర్.. రాజకీయం చేయొద్దని వార్నింగ్

వైైసీపీ ఎమ్మెల్యే ప్సతన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ పై ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని అధికారులపై కేసులు నమోదు చేయడంపై ఆయన [more]

Update: 2020-05-02 07:27 GMT

వైైసీపీ ఎమ్మెల్యే ప్సతన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ పై ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని అధికారులపై కేసులు నమోదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు నియోజకవర్గంలో కొందరు అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీహార్ నుంచి వచ్చిన ఎస్పీ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు. దమ్ముంటే తనపై కేసు నమోదు చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. అధికారులపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News