కవిత ఏం చేయబోతున్నారు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పేరు నెలలుగా వినిపిస్తుంది. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుపై ఉత్కంఠ నెలకొంది;
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పేరు కొన్ని నెలలుగా వినిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి మరీ విచారణ జరిపి వెళ్లిపోయారు. అయితే వరస అరెస్ట్‌ల నేపథ్యంలో కవిత రేపు విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆమె న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా తాను మరో రోజు హాజరవుతానని చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఈడీ అధికారులు కూడా అందుకు అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు. తన విచారణ హాజరుపై స్పష్టత ఇచ్చారు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాసినట్లు తెలిసింది. పదిహేనోతేదీన విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారని సమాచారం. విచారణకు తనకు సమయం కావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.