ఫ్యాక్షన్ రెడ్డీ.. అంతకు అంత వసూల్ చేస్తాం

ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లా మారిందని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఫ్యాక్షన్ రెడ్డి పాలన దేశమంతా తెలిసిపోయిందన్నారు. [more]

Update: 2021-06-18 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లా మారిందని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఫ్యాక్షన్ రెడ్డి పాలన దేశమంతా తెలిసిపోయిందన్నారు. ఏం తప్పు చేశారని ఇద్దరు టీడీపీ నేతలను హత్య చేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కత్తులతో బతికేవాడు కత్తులతోనే పోతాడని లోకేష్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ హత్యలపై దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నారు. ఫ్యాక్షన్ రెడ్డి నీ తండ్రి, తాత అలాగే పోయారని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది టీడీపీ నేతలను హత్య చేశారని ఆయన ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ లు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు వడ్డీతో సహా వసూల్ చేస్తామని నారా లోకేష్ అన్నారు.

Tags:    

Similar News