బహిష్కరణపై చంద్రబాబు పునరాలోచించాలి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. నెల [more]

Update: 2021-04-07 01:24 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. నెల రోజుల సమయంపడుతుందని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినా పట్టించుకోలేదని నారాయణ అన్నారు. నీలం సాహ్ని జగన్ మెప్పు కోసమే నోటిఫికేషన్ ను విడుదల చేశారని నారాయణ అన్నారు. తాము రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు వాయిదా పడినందున పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు పునరాలోచన చేయాలని నారాయణ కోరారు.

Tags:    

Similar News