బ్రేకింగ్ : మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు

అమరావతి భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఆర్డీఏ ఛైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపులో ఈ కేసు నమోదయింది. [more]

Update: 2021-03-16 03:48 GMT

అమరావతి భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఆర్డీఏ ఛైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపులో ఈ కేసు నమోదయింది. కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంపై కేసు నమోదయింది. దళితులకు కేటాయించిన భూములను, 500 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్లలో వన్ టైమ్ సెటిల్ మెంట్ లో క్రమబద్దీకరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20వ తేదీన హాజరు కావాలని సీఐడీ అధికారులు కోరారు. మరికొందరు మాజీ మంత్రులపై కూడా కేసు నమోదు అయ్యే అవకాశముంది.

Tags:    

Similar News