24 గంటలూ అందుబాటులో ఉంటా.. ఫోన్ చేయండి
ఇరవై నాలుగు గంటలూ తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ [more]
ఇరవై నాలుగు గంటలూ తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ [more]
ఇరవై నాలుగు గంటలూ తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఇలాంటి విపత్తులను అడ్డుకోవాలంటే సమిష్టిగా కలసి పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు తీరును ఆయన ప్రశంసించారు. నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. అవసరమైనంత మేరకు నిల్వలు చేసుకోవాలని కోరారు. లాక్ డౌన్ ను కొనసాగించాలని మహారాష్ట్ర, హర్యానా సీఎంలు కోరారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సహచరులతో సమావేశమై లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు రాయితీలు ఇవ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి కోరారు. లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలయ్యేలా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానిని కోరారు. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు త్వరగా పంపిణీ చేయాలని పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.