అమ్మాయిల అక్రమ రవాణాలో ఎన్ఐఏ మరో అరెస్ట్

బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలకమైన పురోగతి సాధించింది . ఈ కేసుకు సంబంధించి తప్పించుకుని తిరుగుతున్న అబ్దుల్ సలీమ్ ని [more]

Update: 2020-05-23 14:57 GMT

బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలకమైన పురోగతి సాధించింది . ఈ కేసుకు సంబంధించి తప్పించుకుని తిరుగుతున్న అబ్దుల్ సలీమ్ ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలని తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరోపణలపై అరెస్టు చేసినట్లు వెల్లడించింది. గత కొంతకాలం నుంచి బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలకు ఉపాధి పేరుతో ఇండియా కు తీసుకువచ్చారు. ఈ అమ్మాయిలని ఇండియాలోని పలు పట్టణాలకు తరలించారు . ఉపాధి పేరుతో ఇక్కడ తీసుకువచ్చిన అమ్మాయిలతో చేత బలవంతంగా వ్యభిచారం చేయించారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక ఈ ముఠా చేతిలో చిక్కుకుపోయారు. ముఠా చెప్పిన మాదిరిగా చేశారు. కొన్నాళ్ళ క్రితం హైదరాబాదులోని ఛత్రినాక లో పోలీసులు ఒక ఇంటిపై దాడి చేసినప్పుడు బంగ్లాదేశ్ అమ్మాయిలని పట్టుకున్నారు. ఈ అమ్మాయిలని పూర్తిస్థాయిలో విచారించినపుడు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి పేరుతో ఇక్కడికి తీసుకువచ్చి బలవంతంగా తమ చేత వ్యభిచారం నిర్వహిస్తున్నారని అమ్మాయిలు విచారణలో చెప్పారు. దీంతో ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ కు పోలీసు అధికారులు బదిలీ చేశారు. అప్పటి నుంచి దీనిపై సమగ్ర విచారణ చేస్తున్న ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసింది . యూసుఫ్ ఖాన్, బేగం,సబ్ షేక్ తో పాటుగా రాహుల్ ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న అబ్దుల్ సలీమ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అరెస్టు చేసింది. ఇవాళ పాతబస్తీలో అబ్దుల్ సలీం ఉన్నాడన్న సమాచారం రావడంతో అరెస్టు చేసింది.

Tags:    

Similar News