ఆ ఎన్నికలపై కూడా సంకేతాలిచ్చిన నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. రేషన్ వాహనాలకు రంగులు వేరేవి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. రేషన్ వాహనాలకు రంగులు వేరేవి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. రేషన్ వాహనాలకు రంగులు వేరేవి వేయాలని, నవరత్నాలు, ముఖ్యమంత్రి ఫొటో తొలగించిన తర్వాతనే గ్రామాలకు పంపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. త్వరలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వస్తున్నందున ఈ వాహనాలకు రంగులు మార్చాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21వ తేదీ తో ముగుస్తాయి. కోడ్ అమలులో ఉండగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు.