చిత్తూరుపైనే నిమ్మగడ్డ కన్ను

చిత్తూరు జిల్లాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ జిల్లాలో ఏకగ్రీవాలను పెండింగ్ లో పెట్టమని నిమ్మగడ్డ రమే‌ష్ [more]

Update: 2021-02-07 02:27 GMT

చిత్తూరు జిల్లాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ జిల్లాలో ఏకగ్రీవాలను పెండింగ్ లో పెట్టమని నిమ్మగడ్డ రమే‌ష్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డిని కూడా ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించారు. ఇక మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 9వ తేదీన మరోసారి చిత్తూరు జిల్లాలో పర్యటించను్నారు. తిరుపతి రూరల్, వడమాల పేట మండాలాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించనున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు జిల్లాలోనే పరిశీలిస్తుండటం విశేషం.

Tags:    

Similar News