అన్నీ ఎన్నికలూ ఒకేసారి జరపండి…నిమ్మగడ్డ ముందు ప్రతిపాదన

అన్ని ఎన్నికలను ఒకేసారి జరపాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ ద్వారా ప్రభుత్వం [more]

Update: 2021-02-12 05:43 GMT

అన్ని ఎన్నికలను ఒకేసారి జరపాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ ద్వారా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. వరస ఎన్నికల కారణంగా కోడ్ అమలులోకి వచ్చి సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కూడా నిలిచిపోతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా ఒకేసారి జరిపితే సమయంతో పాటు ఖర్చు కూడా కలసి వస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్లు తెలిసింది.

Tags:    

Similar News