బ్రేకింగ్ : కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశాలు… రికార్డు చేయాల్సిందే
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాల్గో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సమయంలో వెబ్ కెమెరాలను ఏర్పాటు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాల్గో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సమయంలో వెబ్ కెమెరాలను ఏర్పాటు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాల్గో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సమయంలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రికార్డు చేయాలని ఆదేశించారు. ఫలితాల లీకుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాల్లో వినియోగించాలని నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రయిను మమొత్తం రికార్డు చేయాల్సిందేనన్నారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతంలో విధిగా రికార్డు చేయాలన్నారు. పవర్ కట్ కాకుండా జనరేటర్లను, ఇన్వెర్టర్లను వినియోగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. నాల్గోవిడత పంచాయతీ పోలింగ్, కౌంటింగ్ ఈ నెల 21వ తేదీన జరగనుంది.