ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై నిమ్మగడ్డ?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం సలహాదారు నాగిరెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదలపై ఆయన చర్చించినట్లు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం సలహాదారు నాగిరెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదలపై ఆయన చర్చించినట్లు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం సలహాదారు నాగిరెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. న్యాయపరమైన చిక్కుల విషయంలో వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాలా? లేక ఆగిపోయిన నాటి నుంచి ప్రక్రియను మొదలు పెట్టాలా? అన్న అంశాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించినట్లు తెలిసింది. అలాగే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాగిరెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.