బ్రేకింగ్ : ఆ నలుగురికి రేపు ఉరి లేదు
నిర్భయ నిందితుల కు ఉరిశిక్ష రేపు లేదు. నిజానికి ఫిబ్రవరి 1వ తేదీన నిర్భయ నిందితులు నలుగురికి ఉరిశిక్ష విధించాల్సి ఉంది. తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు [more]
నిర్భయ నిందితుల కు ఉరిశిక్ష రేపు లేదు. నిజానికి ఫిబ్రవరి 1వ తేదీన నిర్భయ నిందితులు నలుగురికి ఉరిశిక్ష విధించాల్సి ఉంది. తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు [more]
నిర్భయ నిందితుల కు ఉరిశిక్ష రేపు లేదు. నిజానికి ఫిబ్రవరి 1వ తేదీన నిర్భయ నిందితులు నలుగురికి ఉరిశిక్ష విధించాల్సి ఉంది. తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రయల్ కూడా చేశారు. అయితే ఢిల్లీ పాటియాలా కోర్టు మాత్రం నిర్భయ నిందితుల ఉరిశిక్షపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఉరిశిక్ష అమలు చేయవద్దని పాటియాలా కోర్టు చెప్పింది. దీంతో నిర్భయ కేసులో నిందితులు నలుగురికి ఉరిశిక్ష అమలు కావడం లేదు. ఒకేసారి నలుగురికి ఉరిశిక్ష విధించడం సరికాదన్న గతంలో చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ నిందితుల తరుపున న్యాయవాదులు పాటియాలా కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో నలుగురికి రేపు ఉరిశిక్ష లేనట్లే. త్వరలోనే ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీని నిర్ణయిస్తారు.