ఎంఐఎం పార్టీకి కంచుకోట వంటి పాతబస్తీలో ఆ పార్టీకి కొంత ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి గట్టి పట్టున్న చార్మినార్, యాకత్ పురా నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులపై బీజేపీ అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా ఎంఐఎం ఎదురీదుతోంది. నాంపల్లిలో ఎంఐఎంపై కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆధిక్యతలో ఉన్నారు. రాజేంద్రనగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 89 స్థానాల్లో, ప్రజాకూటమి 18 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో, ఎంఐఎం నాలుగు స్థానాల్లో, స్వతంత్రులు 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.