లోకేష్ ఎల్ బోర్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. లోకేష్ ఎల్ బోర్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా [more]

;

Update: 2021-04-02 01:22 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. లోకేష్ ఎల్ బోర్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్నాయని ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ లు రెండూ ఒక్కటై ప్రత్యక హోదాను ఏపీకి రానివ్వకుండా చేశాయన్నారు. లోకేష్ ఇప్పటికైనా రాజకీయాలు నేర్చుకుని ప్రజల్లో తిరగాలని పేర్ని నాని హితవు పలికారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తే టీడీపీకే నష్టమన్నారు. బ్యాలట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉంటుందని పేర్ని నాని చెప్పారు.

Tags:    

Similar News