కేఏ పాల్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థే…. నాని సెటైర్లు
భారతీయ జనతా పార్టీపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీజేపీ అందరినీ మోసం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ విషయంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పిన [more]
;
భారతీయ జనతా పార్టీపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీజేపీ అందరినీ మోసం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ విషయంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పిన [more]
భారతీయ జనతా పార్టీపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీజేపీ అందరినీ మోసం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ విషయంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పిన బీజేపీ, పుదుచ్చేరి ఎన్నికల మ్యానిఫేస్టోలో ఎలా పెట్టిందని పేర్ని నాని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పేర్ని నాని ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఏపీకి ఇవ్వలేని హోదా పుదుచ్చేరికి ఎలా ఇస్తారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని, కేఏ పాల్ కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.