పవన్ పాచిపోయిన నోటితో….?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు ఎవరికి ఓటేయమని అడుగుతారని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో టీడీపీకి ఓటేమయన్నారని, మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యునిస్టులకు ఓటేయమని [more]

;

Update: 2021-04-05 01:07 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు ఎవరికి ఓటేయమని అడుగుతారని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో టీడీపీకి ఓటేమయన్నారని, మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యునిస్టులకు ఓటేయమని అడిగారని, ఇప్పుడు కమలం పార్టీకి ఓటేమయని అడుగుతున్నారని, ఎవరిని ప్రజలు నిలదీయాలని పేర్ని నాని అన్నారు. పవన్ కల్యాణ‌్ మాట్లాడేవన్నీ అసత్యాలేనని మంత్రి అన్నారు. పవన్ కల్యాణ్ అద్దెమైకులా తయారయ్యారన్నారు. కాల్ షీట్లకు పవన్ కల్యాణ్ న్యాయం చేశారన్నారు. టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారని పేర్ని నాని విమర్శించారు. నిబద్దత, నిజాయితీ, నియమాలు లేని పవన్ కల్యాణ్ కు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే కనపడతాడని అందరికీ తెలుసునన్నారు.

Tags:    

Similar News