దళిత బంధుపై హైకోర్టులో?

దళిత బంధు పథకం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. పైలట్ ప్రాజెక్టుగా దాని అమలు నిలిపేయాలని కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని పిటీషనర్లు కోరారు. తెలంగాణ [more]

Update: 2021-08-02 06:07 GMT

దళిత బంధు పథకం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. పైలట్ ప్రాజెక్టుగా దాని అమలు నిలిపేయాలని కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని పిటీషనర్లు కోరారు. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శితో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ప్రతివాదులుగా చేర్చారు. రాజ్యంగ విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిటీషనర్ ఆరోపించారు. అయితే దీనిపై అత్యవసరంగా విచారించలేమని, లిస్ట్ ప్రకారమే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Tags:    

Similar News