Pithani : పితాని కీలక నిర్ణయం… జనసేనకు మద్దతు

మాజీ మంత్రి పితాని సత్యానారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు మద్దతివ్వాలని నిర్ణయించారు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండి జనసేనకు మద్దతివ్వాలని పితాని సత్యానారాయణ [more]

;

Update: 2021-11-09 07:09 GMT

మాజీ మంత్రి పితాని సత్యానారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు మద్దతివ్వాలని నిర్ణయించారు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండి జనసేనకు మద్దతివ్వాలని పితాని సత్యానారాయణ నిర్ణయం తీసుకున్నారు. పెనుగొండలో జనసేన అభ్యర్థికి తాము మద్దతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీ ని ఓడించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పితాని సత్యానారాయణ ప్రకటించారు.

ఇక్కడి వరకే….

అయితే ఇది కేవలం ఆచంట నియోజకవర్గంలోని జనసేన, టీడీపీ నేతలకు మధ్య కుదిరిన ఒప్పందం మాత్రమేనని పితాని సత్యానారాయణ చెప్పారు. రాష్ట్ర స్థాయి నేతలకు ఈ పొత్తుతో సంబంధం లేదని చెప్పారు. తాము ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా పొత్తులు కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. పెనుగొండలో జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేనకు తాము మద్దతిస్తున్నట్లు పితాని సత్యానారాయణ ప్రకటించారు.

Tags:    

Similar News