చంద్రబాబుపై కేంద్రమంత్రి ఆరోపణలు
కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు చెప్పడం లేదని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ… అడిగిన దాని కంటే కేంద్రం [more]
;
కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు చెప్పడం లేదని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ… అడిగిన దాని కంటే కేంద్రం [more]
కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు చెప్పడం లేదని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ… అడిగిన దాని కంటే కేంద్రం ఎక్కువ సహకరిస్తుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి రూ.2 వేల కోట్లు ఇస్తే చంద్రబాబు మాత్రం గ్రాఫిక్స్ చూపిస్తున్నారని, తాత్కాలిక భవనాలతో కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులను దోచుకుంటున్నారని అన్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని, పైగా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.