ఆంధ్రా ప్రజలారా.. వారి మాటలు నమ్మకండి
‘‘ఆంధ్రా ప్రజలారా.. మేము తెలంగాణలో సంతోషంగా ఉంటున్నాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రావాళ్లను ఏమీ అనలేదు. చాలా గౌరవంగా చూస్తున్నారు. దయచేసి రాజకీయలబ్ధి కోసం చంద్రబాబు, పవన్ [more]
;
‘‘ఆంధ్రా ప్రజలారా.. మేము తెలంగాణలో సంతోషంగా ఉంటున్నాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రావాళ్లను ఏమీ అనలేదు. చాలా గౌరవంగా చూస్తున్నారు. దయచేసి రాజకీయలబ్ధి కోసం చంద్రబాబు, పవన్ [more]
‘‘ఆంధ్రా ప్రజలారా.. మేము తెలంగాణలో సంతోషంగా ఉంటున్నాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రావాళ్లను ఏమీ అనలేదు. చాలా గౌరవంగా చూస్తున్నారు. దయచేసి రాజకీయలబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలను దయచేసి నమ్మకండి’’ అని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అభ్యర్థించారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయన్నారు. పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకుంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడితే, కేసీఆర్ దుర్మార్గుడు అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లి ఎందుకు ప్రశంసించారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇలాంటివి మాట్లాడి గొడవలు పెట్టడం సరికాదన్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామో, ప్రజలకు ఎలా సేవ చేస్తామో, వారి లక్ష్యమేంటో, మ్యానిఫెస్టో ఎంటో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలని, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.