సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. ఆదర్శంగా నిలిచాం

కోవిడ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనిందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కోవిడ్ సమయంలో ప్రణబ్ ముఖర్జీ లాంటి ఎందరో [more]

Update: 2021-01-29 05:58 GMT

కోవిడ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనిందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కోవిడ్ సమయంలో ప్రణబ్ ముఖర్జీ లాంటి ఎందరో నేతలను కోల్పోయామన్నారు. కష్టసుఖాలను భారతీయులందరూ కలసి ఐక్యంగా ఎదుర్కొన్నారని రాష్ట్రపతి చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో సమర్థవంతంగా ముందుకు నడిచామని తెలిపారు. కోవిడ్ తర్వాత భారత్ ప్రపంచంలో మరింత శక్తిమంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ఆరేళ్లలో ఆరోగ్యరంగంలో చేపట్టిన సంస్కరణలో కరోనా సమయంలో ఉపయోగపడ్డాయన్నారు. ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందించిన ఘనత భారత్ కు దక్కడం ప్రశంసనీయమన్నారు. కేంద్ర పథకాలు నిరుపేద మహిళలకు కరోనా సమయంలో ఆసరాగా నిలిచాయన్నారు. ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామనిచెప్పారు. కోటిన్నర మందికి ఉచితంగా వైద్య సౌకర్యాన్ని కరోనా సమయంలో కల్పించామని చెప్పారు. దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకున్నామని రాష్ట్రపతి తెలిపారు. సీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని చెప్పారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. శాంతిభద్రతలను ఆషామాషీగా తీసుకోవద్దని చెప్పారు.

Tags:    

Similar News