జమ్మూ కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇవాళ అర్థరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. బీజేపీ-పీడీపీ ప్రభుత్వం రద్దయ్యాక ఆరునెలల పాటు గవర్నర్ పాలన విధించారు. ఆరునెలల గవర్నర్ పాలన ముగియడంతో రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.