ఆ "ఏనుగు" వద్దకు వెళ్లనున్న మోదీ
ఆస్కార్ అవార్డు అందుకున్న ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ తీసిన ప్రాంతాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు
ఆస్కార్ అవార్డు అందుకున్న ఎలిఫెంట్ విస్పర్స్ అనే తమిళ డాక్యుమెంటరీ తీసిన ప్రాంతాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. మదుమలై అడవికి ప్రధాని మోదీ ఈరోజు వెళ్లి పరిశీలించనున్నారు. నీలగిరి జిల్లా మదుమలై అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణతో పాటు ఏనుగుల సంరక్షణ కూడా ఉంది. తప్పి పోయిన ఏనుగులను ఇక్కడ రక్షించి పెంచుతుంటారు. అటవీ ప్రాంతంలోనే ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆస్కార్ అవార్డు పొందిన...
దీనిపై రూపొందించిన డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెతలిసింది. అందులో నటించిన బొమ్మన్, వల్లితో పాటు డాక్యుమెంటరీలో కనిపించిన రఘు అనే ఏనుగును కూడా చూడనున్నారు. బొమ్మన్, వల్లితో మోదీ కాసేపు ముచ్చటించనున్నారు. దీంతో మదుమలై అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏనుగు సంరక్షణ కేంద్రంలో సేవలందిస్తున్న సిబ్బందిని కూడా మోదీ పలుకరించనున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకకు బయలుదేరి వెళతారు.