పీఎస్ఎల్‌వీ సీ 52 ర్యాకెట్ ప్రయోగం సక్సెస్
పీఎస్ఎల్‌వీ సీ 52 ర్యాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది;
పీఎస్ఎల్వీ సీ 52 ర్యాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సీ52 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తలు సంబరాల చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ ఏడాది నెల్లూరులోని షార్ నుంచి జరిపిన తొలి ప్రయోగం విజయవంతమయింది.
అనేక ప్రయోజనాలతో....
పీఎస్‌ఎల్‌వీ సీ52 అనేక ప్రయోజనాలున్నాయి. పదేళ్ల పాటు కక్షలో ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా 24 గంటలూ పనిచేసేలా శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ సమాచారం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఉపగ్రహాల ద్వారా...
ఇనస్పైర్ శాగ్ -1 ను వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు రూపొందించారు. దీని బరువు 81. కిలోలు మాత్రం. ఏడాది కాలం మాత్రమే దీని జీవితకాలం. ఇక ఐఎన్ఎస్ - 2 డీ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ లు కలసి రూపొందించాయి. దీని జీవితకాలం ఆరునెలలు. భవిష్యత్ సైన్సు, పేలోడ్స్ కోసం కూడా దీనిని రూపొందించారు. పీఎస్ఎల్‌వీ సీ 52 విజయవతం కావడంతో ప్రధానితో సహా ప్రముఖలందరూ భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.