రెడ్ టేపిజం లేదు.. రెడ్డియిజమే….రాజుగారి సంచలన వ్యాఖ్యలు

తాను పుట్టి పెరిగింది విజయవాడలోనేని, అమరావతిపై మాట్లాడే హక్కు తనకు ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనకు రాజధాని అమరావతిపై మాట్లాడే పూర్తి హక్కులున్నాయన్నారు. [more]

Update: 2020-08-13 07:33 GMT

తాను పుట్టి పెరిగింది విజయవాడలోనేని, అమరావతిపై మాట్లాడే హక్కు తనకు ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనకు రాజధాని అమరావతిపై మాట్లాడే పూర్తి హక్కులున్నాయన్నారు. గవర్నర్ ఆమోదించిన మూడు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా గవర్నర్ బిల్లులను ఆమోదించారన్నారు. దేశంలో ఎక్కడైనా రాష్ట్రానికి ఒకే రాజధాని ఉందన్నారు. జగన్ క్రిస్టియన్ కావడంతో కులమతాల ప్రస్తావన ఉండదని అందరూ బావించారని, కానీ ప్రభుత్వంలో రెడ్ టేపిజం లేకున్నా, రెడ్డిజం ఉందని రఘు రామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి రెండు రోజుల కొకసారి ఒక రెడ్డిగారి నియామకం ఉంటుందన్నారు. అన్ని పెద్ద పోస్టులకు రెడ్డిలను నియమిస్తారని, పనికి రాని పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారని రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుర్రం దేవేందర్ రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లిస్తూ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఉపయోగించుకుంటున్నారన్నారు. దీనిపై తాను చీఫ్ సెక్రటరీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని చెప్పారు. అతనిపై చర్యలు తీసుకోకుంటే తాను సభా హక్కుల నోటీసు లు ఇస్తానని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

Tags:    

Similar News