Rahul gandhi : ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?

యూపీ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రైతుల హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. లఖింపూర్ ఘటనలో యూపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన [more]

;

Update: 2021-10-06 04:57 GMT

యూపీ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రైతుల హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. లఖింపూర్ ఘటనలో యూపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు. యూపీ వెళ్లిన ప్రధాని లఖింపూర్ ను ఎందుకు సందర్శించలేదని రాహుల్ ప్రశ్నించారు. తాము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటే ముగ్గురు వెళ్లేందుకు అనుమతివ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీ అరెస్ట్ అక్రమమని ఆయన అన్నారు. ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో నియంత పాలన కొనసాగుతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Tags:    

Similar News