పోటీ లో ఉన్నవాళ్లకు మద్దతు తెలపాల్సిందే

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడానికే ఎన్నికలను బహిష్కరించామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓటమి భయంతో బహిష‌్కరించామని చెప్పడం తప్పుడు ప్రచారమని చెప్పారు. అన్ని [more]

;

Update: 2021-04-06 00:57 GMT
పోటీ లో ఉన్నవాళ్లకు మద్దతు తెలపాల్సిందే
  • whatsapp icon

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడానికే ఎన్నికలను బహిష్కరించామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓటమి భయంతో బహిష‌్కరించామని చెప్పడం తప్పుడు ప్రచారమని చెప్పారు. అన్ని వ్యవస్థలను వైసీపీ భ్రష్టు పట్టించిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిందన్నారు. ఇవన్నీ దేశ ప్రజలకు తెలియజెప్పడానికే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కొందరు పోటీ చేస్తామని ఉత్సాహ పడుతున్నారని, వారిని నిరుత్సాహపర్చాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News