revanth reddy : అమిత్ షా అపాయింట్ మెంట్ కోరతాం
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీవ్రమయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. సైదాబాద్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. [more]
;
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీవ్రమయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. సైదాబాద్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. [more]
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీవ్రమయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. సైదాబాద్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందన్నారు. బెల్ట్ షాపులు పెట్టి మరీ తాగుబోతులను తయారు చేస్తున్నారన్నారు. డ్రగ్స్ కేసులో అకుల్ సబర్వాల్ ను ఎందుకు ప్రభుత్వం తప్పించిందో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న వాటిని రాష్ట్రానికి వస్తున్న హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువస్తామని చెప్పారు. అమిత్ షా అపాయింట్ మెంట్ కోరతామని, ఆయన అపాయింట్ మెంట్ ఇస్తే అన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళతామని చెప్పారు.