నీవు గాక దిక్కెవరు..?
కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని గాంధీయేతర కుటుంబాలకు అప్పగించేందుకు నేతలు సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించేవారు లేరు. రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోవడానికి [more]
కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని గాంధీయేతర కుటుంబాలకు అప్పగించేందుకు నేతలు సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించేవారు లేరు. రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోవడానికి [more]
కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని గాంధీయేతర కుటుంబాలకు అప్పగించేందుకు నేతలు సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించేవారు లేరు. రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తిరిగి సోనియాగాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని పార్టీ నేతలందరూ ముక్తకంఠంతో కోరారు. దీంతో సోనియా గాంధీ కూడా అంగీకరించక తప్పని పరిస్థితి. అయితే తాత్కాలిక అధ్యక్షురాలిగా మాత్రమే సోనియా గాంధీ ఉంటారు. తదుపరి అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకూ సోనియా గాంధీయే అధ్యక్షురాలిగా ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఇందుకు సోనియా గాంధీ సయితం కాస్త మెల్లగానైనా తలూపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించింది.