పక్కా ప్లాన్ తోనే ఢిల్లీలో?
ఢిల్లీ అలర్లు బాధాకరమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత సోనియా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు [more]
ఢిల్లీ అలర్లు బాధాకరమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత సోనియా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు [more]
ఢిల్లీ అలర్లు బాధాకరమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత సోనియా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోనియా అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఢిల్లీలో నేడు ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పక్కా ప్లాన్ తోనే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు బీజేపీయే కారణమని సోనియాగాంధీ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని చెప్పారు. పోలీసులపై కూడా సోనియా నిందలు వేశారు.