నిర్దయ వద్దు.. ఇబ్బంది పెట్టే నిర్ణయాలు అసలే వద్దు
వలస కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరించవద్దని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వలస కార్మికులు దేశానికి [more]
వలస కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరించవద్దని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వలస కార్మికులు దేశానికి [more]
వలస కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరించవద్దని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వలస కార్మికులు దేశానికి వెన్నుముకగా సోనియా గాంధీ అభివర్ణించారు. వారిని కష్టకాలంలో మరింత ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. నాలుగు గంటల సమయం ఇచ్చి లాక్ డౌన్ ను విధిస్తే వారు గమ్యస్థానాలకు ఎలా చేరుకుంటారని సోనియా గాంధీ ప్రశ్నించారు. అవసరమైతే వలస కార్మికుల తరలింపు ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం వలస కార్మికుల తరలింపులో సహకరిస్తుందని సోనియా లేఖలో పేర్కొన్నారు.