సోనియా రాజీనామా వ్యవహారంపై నేడు

సోనియా గాంధీ రాజీనామా వ్యవహారం పార్టీలో కలకలం రేపుతోంది. 23 మంది సీనియర్లు తనకు లేఖ రాయడాన్ని సీరియస్ గా తీసుకున్న సోనియా గాంధీ పదవికి రాజీనామా [more]

Update: 2020-08-24 02:44 GMT

సోనియా గాంధీ రాజీనామా వ్యవహారం పార్టీలో కలకలం రేపుతోంది. 23 మంది సీనియర్లు తనకు లేఖ రాయడాన్ని సీరియస్ గా తీసుకున్న సోనియా గాంధీ పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోమని నేతలకు సూచించారు. తాను పదవిలో కొనసాగలేనని చెప్పారు. దీంతో నేడు సమావేశమయ్యే సీడబ్ల్యూసీ లో సోనియా రాజీనామా అంశం ప్రధానంగా మారింది. గాంధీ కుటుంబీకులే కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాలని ఎక్కువ మంది కోరుతున్నారు. సోనియా రాజీనామాతోనైనా రాహుల్ గాంధీ ఆ పదవిని స్వీకరించాలని మరికొందరు కోరుతున్నారు. దీంతో నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News