బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా కేసులు..మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా కారణంగా ఏపీలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరుుకుంది. మరణాల సంఖ్య 41గా ఉంది. కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఒక్కరు కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో మృతి చెందారు. ఏపీలో యాక్టివ్ కేసులు 1004 ఉన్నాయి. ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా మరో కేసు నమోదయింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 547 కేసులు నమోదయ్యాయి. ఈరోజు అనంతపురం జిల్లాలో కొత్తగా 16 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.