సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు
సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. . ఈ రోజు తెల్లవారు జామున కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.;
సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ రోజు తెల్లవారు జామున కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటుతో కాంటినెంటల్ హాస్సిటల్ లో చేరిన కృష్ణ తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయంది. 1943 మే 31వ తేదీన కృష్ణ బుర్రిపాలెంలో జన్మించారు. కులగోత్రాల సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణ 340 సినిమాలకు పైగా నటించారు.
80 ఏళ్లుగా...
వెండితెరపై డేషింగ్ అండ్ డేరింగ్ హీరోగా ఒక వెలుగు వెలిగిన కృష్ణ ఎందరినో అభిమానులను సంపాదించుకున్నారు. కృష్ణ మరణంతో తెలుగు సినీ రంగంలో ఒక జనరేషన్ ముగిసి పోయింది. తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేశారు. కృష్ణ హీరోగానే కాదు 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఎనభై ఏళ్ల వయసున్న కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.