బ్రేకింగ్ : తీర్పు రిజర్వ్… రేపు జడ్జిమెంట్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 24 గంటల్లో ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష అవసరమని [more]

Update: 2019-11-25 06:49 GMT

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 24 గంటల్లో ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బలం ఎంతుంది అనేది సుప్రీంకోర్టులో తేలదని, శాసనసభలోనే తేలుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీలయినంత త్వరగా బలపరీక్ష జరిగితేనే మంచిదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందరి వాదనలు విన్న తర్వాత తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. తీర్పు రిజర్వ్ కావడంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి.

Tags:    

Similar News