రాహుల్ గాంధీకి చుక్కెదురు

ఎన్నికల వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీకి కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికల ప్రసంగంలో భాగంగా ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చౌకీదార్ [more]

Update: 2019-04-23 07:40 GMT

ఎన్నికల వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీకి కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికల ప్రసంగంలో భాగంగా ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ అంటూ విమర్శలు చేశారు. రఫేల్ డీల్ కు సంబంధించి రివ్యూ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారణకు తీసుకున్న సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. సుప్రీం కూడా చౌకీదార్ చోర్ అంటోందని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు అనని మాటను అన్నట్లుగా రాహుల్ గాంధీ చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన వ్యాఖ్యల ఉద్దేశ్యం సుప్రీంకోర్టును ఆపాదించడం కాదని రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే, రాహుల్ గాంధీ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. ఇవాళ రాహుల్ గాంధీపై మరోసారి సీరియస్ అయిన కోర్టు ఆయనలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, ఆయన స్పందన సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. దీంతో తన వ్యాఖ్యలపై ఈ నెల 30వ తేదీ లోగా లిఖితపూర్వత సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది.

Tags:    

Similar News