మూడు గంటలుగా హై డ్రామా

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ మారడం తలనొప్పిగా మారింది. దుట్టా రామచంద్రారెడ్డి వర్గం వంశీ వర్గాలుగా గన్నవరంలో విడిపోయాయి. తాజాగా బాపులపాడు మండలం కాకులపాడులో రైతు [more]

Update: 2020-10-03 12:42 GMT

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ మారడం తలనొప్పిగా మారింది. దుట్టా రామచంద్రారెడ్డి వర్గం వంశీ వర్గాలుగా గన్నవరంలో విడిపోయాయి. తాజాగా బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కోసం వచ్చిన వల్లభనేని వంశీ వర్గీయులను దుట్టా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వల్లభనేని వంశీ ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వల్లభనేని వంశీ తాను అన్ని వర్గాలను కలుపుకుని పోతానని చెబుతున్నా దుట్టా వర్గీయులు మాత్రం ససేమిరా అంటున్నారు. గతంలో వైసీపీ వర్గీయులపై వల్లభనేని వంశీ అక్రమ కేసులు పెట్టారని దుట్టా వర్గీయులు మండిపడుతున్నారు. మూడు గంటలుగా కాకులపాడులో హైడ్రామా జరుగుతుంది.

Tags:    

Similar News