అఖిలప్రియ లేకుండానే...ఆళ్లగడ్డలోకి

ఎండల దెబ్బకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాయంత్రం వేళ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

Update: 2023-05-21 02:44 GMT

ఎండల దెబ్బకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాయంత్రం వేళ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాత్రి పదకొండు గంటల వరకూ యాత్ర చేస్తున్నారు. ఉదయం ఆయన తన శిబిరంలో వివిధ సామాజికవర్గాలతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తున్నారు. ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. అయితే అఖిలప్రియ జైలులో ఉండటంతో ఆమె లేకుండానే ఆళ్లగడ్డలో లోకేష్ పర్యటించనున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర 1346 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈరోజుకు పాదయాత్ర 106వ రోజుకు చేరుకుంది.

వివిధ వర్గాలతో....
మధ్యాహ్నం రెండు గంటలకు అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ ఓనర్లు, కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఆముదాలమెట్ట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. 4.15 గంటలకు ఆముదాలమెట్టలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు చౌదరిదిన్నెలో రైతులతో సమావేశం కానున్నారు. 5.15 గంటలకు కోవెలకుంట్లలో ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులతో సమావేశం కానున్నారు.
రాత్రికి ఆళ్లగడ్డలోకి...
సాయంత్రం 5.30 గంటలకు కోవెలకుంట్ల అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో సమావేశమైన లోకేష్ వారి సమస్యలపై చర్చించనున్నారు. 6.20 గంటలకు కుందూనది బ్రిడ్జి వద్ద కుందూ పోరాట సమితి రైతులతో సమావేశం అవుతారు. రాత్రి 7.10 గంటలకు బీమునిపాడులో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 8.30 గంటలకు కంపమళ్లమిట్ట బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. 9.50 గంటలకు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. 10.25 గంటలకు దొర్నిపాడు శివారులో బస చేయనున్నారు.


Tags:    

Similar News