జమ్మలమడుగులో టెన్షన్…టెన్షన్
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గం గూడెం చెరువు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం [more]
;
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గం గూడెం చెరువు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం [more]
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గం గూడెం చెరువు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త మహేశ్వరరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.