టికెట్‌ వస్తుందా? ఊడుతుందా? నేతల దెబ్బకు వారి ఫోన్లు స్విచ్ఛాప్‌

తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల

Update: 2023-08-21 06:50 GMT

తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మేరకు గులాబీ అధినేత కేసీఆర్‌ అన్నినియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు పరిశీలించి ఎన్నో వడపోతలు చేసి తొలి జాబితాను ఈ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. దీంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎలక్షన్‌లో గులాబీ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేయనున్నారో తేలిపోనుంది. జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఎవరెవరికి సీటు ఊడుతుంది..? వస్తుందా? అనేది తేలిపోనుంది. ప్రస్తుతం తెలంగాణ ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అధికారులతో పాటు గతంలో పనిచేసిన అధికారులకు సైతం ఎమ్మెల్యే అభ్యర్థులు వందలసార్లు కాల్ చేస్తున్నారు. ఈ సారి టికెట్‌ ఊడుతుందా..? వస్తుందా..? అనే సందిగ్ధంలో ఉన్నారు ఆశావాహులు.

ఈ సారి జాబితాలో ఎవరెవరు పేర్లు ఉంటాయన్నది తెలుసుకుంటున్నారట. అయితే ఈ పొలిటికల్‌ ఫోన్లు భరించలేక కొంత మంది ఇంటెలిజెన్స్ పోలీసులు తమ ఫోన్‌లను స్వీచ్ఛాఫ్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్‌ ఒకేసారి 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో చాలామంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులు.. తమ పేరు జాబితాలో ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటలిజెన్స్ వర్గాలకు ఫోన్‌ చేస్తున్నట్లు సమాచారం.

అయితే గులాబీ బాస్‌ మాత్రం అన్ని సర్వేల ఆధారంగా, వారి పని తీరు అధారంగా టికెట్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చేయించిన ఇంటెలిజెన్స్ సర్వేలో తమ పనితీరు ఏ రకంగా ఉంది.. టికెట్ వస్తుందా లేదా.? అన్న ప్రశ్నలతో నేతలు అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ మొదటి అభ్యర్థుల లిస్టు బయటికి వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఫోన్లు మోత మొగుతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News