తెలంగాణ బడ్జెట్ 2, 90, 396 కోట్లు
తెలంగాణ 2023-24 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. మొత్తం 2, 90, 396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణలో 2023-24 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. మొత్తం 2, 90, 396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయాన్ని 2, 11, 685 కోట్లుగా చూపించారు. మూలధన వ్యయాన్ని 37, 525 కోట్లుగా బడ్జెట్ లో పొందుపర్చారు. దళితబంధు పథకానికి 17,700 కోట్లు, నీటి పారుదల రంగానికి 26,885 కోట్లు, విద్యుత్తు రంగానికి 12,727 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిపారు.
సంక్షేమానికి...
ఆసరా పింఛన్లకు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 6,229 కోట్లు కేటాయించారు. గిరిజన సంక్షేమానికి, ప్రత్యేక నిధికి 15,223 కోల్లు, వ్యవసాయ శాఖకు 26,831 కోట్లు కేటాయింపులు జరిపారు. ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రాన్ని ప్రగతి బాటన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించారన్నారు. తెలంగాణలో ఆచరించిన పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరించే విధంగా కొనసాగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారన్నారు. సాగునీటి రంగానికి అత్యధికంగా ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందన్నారు.