విదేశాల నుంచి వస్తే తెలంగాణలో క్వారంటైన్ కే?

కొత్త రకం కరోనాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయాలని నిర్ణయించింది. యూకేలో కొత్తరకం కరోనా [more]

Update: 2020-12-21 12:51 GMT

కొత్త రకం కరోనాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయాలని నిర్ణయించింది. యూకేలో కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఎయిర్ పోర్టులోనే విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల్లో పాజిటివ్ తేలితే వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. నెగిటివ్ వచ్చినా క్వారంటైన్ కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రకం కరోనా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News