సొంత ఇంట్లో చంద్రబాబు కు భారీ షాక్
కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆసక్తికర ఫలితాలు ఇచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పై చేయి సాధించింది. మొత్తం [more]
;
కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆసక్తికర ఫలితాలు ఇచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పై చేయి సాధించింది. మొత్తం [more]
కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆసక్తికర ఫలితాలు ఇచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పై చేయి సాధించింది. మొత్తం 89 పంచాయతీ లకు ఎన్నికలు జరగ్గా అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం విశేషం. వైసీపీ 74 స్థానాల్లోనూ, టీడీపీ 14 స్థానాల్లోనూ విజయం సాధించింది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ 72, కాంగ్రెస్ 14, వైసీపీ 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇప్పడు కూడా కాంగ్రెస్ కుప్పం నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో గెలవడం విశేషం. అయితే అధికార పార్టీ అరాచకాల వల్లనే కుప్పంలో వైసీపీ గెలిచిందని టీడీపీ ఆరోపిస్తుంది.